జంగంపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ కోత కార్యక్రమం
భిక్కనూర్ సెప్టెంబర్ 25 (ప్రజావాణి):
కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామంలో రంగు లలిత హన్మగౌడ్ 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో కోత కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో డిహెచ్ అండ్ ఎస్ ఓ ( DH&SO )జ్యోతి మాట్లాడుతూ, రైతులకు ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీలు మరియు హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) సంస్థ అందిస్తున్న సహకారం, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కోసం ₹5,000 సహాయం గురించి వివరించారు.
అలాగే, ఆయిల్ పామ్ గెలలను సరైన పద్ధతిలో కోయడం, కోసిన గెలలను సురక్షితంగా లోడింగ్ చేయడం, సులభంగా రవాణా చేయడం మరియు మార్కెటింగ్ చేసే విధానాలపై రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో DH&SO జ్యోతి , HO సుమన్ సర్, HUL జనరల్ మేనేజర్ శ్రీ చంద్రబాబు సర్, సీనియర్ మేనేజర్ – క్రాప్ డెవలప్‌మెంట్ ప్రమోద్ కుమార్ , ఎక్స్‌టెన్షన్ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ , క్లస్టర్ మేనేజర్ హిమకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, మురళి , రైతు రంగు లలిత హన్మగౌడ్ మరియువివిధ గ్రామాల రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
అధికారులు ఆయిల్ పామ్ తోటను పరిశీలించి, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి తోట నిర్వహణ మరియు పంట అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు అందించారు.
రైతు శ్రీ రంగు లలిత హన్మగౌడ్ , తమ ఆయిల్ పామ్ తోట మంచి పెరుగుదలతో పాటు మంచి దిగుబడిని ఇస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఆయిల్ పామ్ పంటను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే, దీర్ఘకాలికంగా మంచి ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా సులభంగా నిర్వహించుకోవచ్చు. కావున రైతులందరూ ఆయిల్ పామ్ సాగును చేపట్టి, శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులు మరియు ఆదాయం పొందాలని కోరుతున్నాము.

