*భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు*
*పూజల్లో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి*
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 ప్రజావాణి
చందనవెల్లి గ్రామంలో వినాయక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవనీత స్వామి చంద్రశేఖర్ జనార్దన్ రెడ్డి యాదయ్య వినాయక భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు
RELATED ARTICLES

