📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది

ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది

📰 Generate e-Paper Clip

ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది

* జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

* ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్

జమ్మికుంట సెప్టెంబర్ 24 (ప్రజావాణి)

జమ్మికుంటవిద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా తీర్చిదిద్దడంతో పాటు వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్ అన్నారుగురువారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్.మాట్లాడుతూవిద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలని సూచించారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు సామాజిక బాధ్యత, సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆయనసూచించారుఎన్‌ఎస్‌ఎస్‌ను 1969 సెప్టెంబర్ 24న మహాత్మాగాంధీ శతజయంతి సందర్భంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి. రావు ప్రారంభించారనితెలిపారుప్రారంభ సమయంలో దేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో సుమారు 40 వేల మంది విద్యార్థి వాలంటీర్లతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ నిరంతరం కృషి చేస్తోందన్నారుసమాజంలో నెలకొన్న సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారుగ్రామాలు పట్టణాల్లో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చురుగ్గా పాల్గొనాలని సూచించారుఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌-1 ప్రోగ్రామ్ అధికారి కె. తిరుపతి యూనిట్‌-2 ప్రోగ్రామ్ అధికారి ఈ. జ్యోత్న దేవకి, అధ్యాపకులు జి. ప్రభాకర్ చి. తిరుపతి శ్రీధర్ ఎన్. ప్రసాద్ డి మహేష్ ఎండీ ఖలీమ్ ఎండీ దాదే అమర జ్యోతి ఎండీ షేఖిల్. కె. ప్రదీప్ లైబ్రేరియా బి ప్రగతి పి. సీమ జి. కవిత జి శ్రీధర్ ఎస్. శ్రీనివాస్ టి అనూష జి. హర్షిణి ఎన్ శివశంకర్ డి. వీరాస్వామి 200మంది విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.