మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన…!
నీళ్ల లీకేజీ పై వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన ఈ. ఈ..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసి ప్రారంభం చేసిన కొద్ది రోజులకే వంద పడకల ఆసుపత్రి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాసిరకం పనులు వలన వంద పడకల ఆసుపత్రిలో నీళ్లు లీకేజీ పై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వార్తా కథనానికి ఇంజనీరింగ్ జిల్లా స్థాయి మండల అధికారులు గురువారం ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ దవాఖాను సందర్శించి పరిశీలించి నివేదిక తయారు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం కలగడంతో పాటు సోషల్ మీడియా వేదికగా నాసిరకం పనులపై పలువురు నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్న నేపథ్యం.ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి నాణ్యత ప్రమాణాలు కలిగిన అభివృద్ధి పనులు జరిగే విధంగా చొరవ తీసుకోవాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

