📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetభారీ వర్షాల ప్రభావంతో రహదారిపై పడిన చెట్టు. తక్షణమే స్పందించిన మఠంపల్లి పోలీసులు.

భారీ వర్షాల ప్రభావంతో రహదారిపై పడిన చెట్టు. తక్షణమే స్పందించిన మఠంపల్లి పోలీసులు.

📰 Generate e-Paper Clip

భారీ వర్షాల ప్రభావంతో రహదారిపై పడిన చెట్టు.

తక్షణమే స్పందించిన మఠంపల్లి పోలీసులు.

హుజూర్నగర్ సెప్టెంబర్ 24 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మఠంపల్లి మండలం లోని రఘునాథపాలెం నుంచి కిష్టాపురం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ మర్రిచెట్టు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందిన వెంటనే మఠంపల్లి పోలీసులు తక్షణమే స్పందించి, స్థానిక ప్రజలు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారంతో రహదారిపై పడిన చెట్టును తొలగించారు. అనంతరం రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై చెట్లు లేదా ఇతర అడ్డంకులు ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.