📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కొన్నె గ్రామ మాజీ ఎంపీటీసీ కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా

కొన్నె గ్రామ మాజీ ఎంపీటీసీ కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా

📰 Generate e-Paper Clip

జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మల్గ సిద్దిరాములు కుమార్తె వివాహ వేడుక బచ్చన్నపేటలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్ లో గురువారం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. కుటుంబ పెద్దలకు, బంధుమిత్రులకు, ఆహ్వానితులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వివాహ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.