📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్లలో భక్తి శ్రద్దలతో గణనాథుని నిమజ్జన వేడుకలు

గుగ్గిళ్లలో భక్తి శ్రద్దలతో గణనాథుని నిమజ్జన వేడుకలు

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్లలో భక్తి శ్రద్దలతో గణనాథుని నిమజ్జన వేడుకలు

బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 3వ వార్డు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు నిమజ్జన వేడుకలకు హాజరైన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, వార్డు సభ్యుడు దూశెట్టి రాజిరెడ్డిని వార్డు ప్రజలు, మహిళలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య మాట్లాడుతా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గణనాథుడిని వేడుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడికి వైభవంగా వీడ్కోలు పలుకుతున్న ప్రజలంతా ఆనందంగా, సురక్షితంగా వేడుకలు ముగించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి పాటలు, తప్పెట్ల చప్పుళ్ల నడుమ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చి నిమజ్జనం చేశారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా బెజ్జంకి మండల అధ్యక్షుడు సీత భూమయ్య, యాదిరెడ్డి, చిట్టి శీను, తుమ్మరాజు, సీత శ్రీకాంత్, తిరుపతితో పాటు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.