📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంపీపీఎస్ మాద్వార్ పాఠశాలలో దుస్తులు పంపిణీ చేసిన మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్

ఎంపీపీఎస్ మాద్వార్ పాఠశాలలో దుస్తులు పంపిణీ చేసిన మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్

📰 Generate e-Paper Clip

ఎంపీపీఎస్ మాద్వార్ పాఠశాలలో దుస్తులు పంపిణీ చేసిన మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్,

మక్తల్ (ప్రజావాణి): సెప్టెంబర్ 23.మక్తల్ మండలం మాధ్వార్ గ్రామ ఎంపీపీఎస్ పాఠశాలలో ఈరోజు ఉదయం,ఉచిత దుస్తులు,సాక్సులు మరియు బెల్టులు, మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాములు,గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి అంజమ్మ,ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు,పంపిణీ చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వo సరఫరా చేసినటువంటి ఉచిత పుస్తకాలు,నోటు పుస్తకాలు,ఉచిత మధ్యాహ్న భోజనము, బలవర్ధకమైన ఆహారం, రాగిజావా,గుడ్లు, యూనిఫామ్, ఉచిత దుస్తులు, బూట్లు, సాక్సులు, రైసింగ్ తెలంగాణ పేరుతో ఇవ్వబడినటువంటి బెల్టులను ప్రతి విద్యార్థిని,విద్యార్థులు సద్వినియోగపరుచుకొని చక్కగా చదువుకొని పాఠశాలకు అలాగే మన గ్రామానికి మంచి పేరు తేవాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్,కూడా విద్యార్థిలకు యూనిఫామ్స్ బెల్టులు సాక్స్లు,అందజేసి చక్కగా చదువుకోవాలని తెలియజేశారు. అనంతరం తరగతులు మధ్యాహ్నం భోజనం, పాఠశాల ప్రాంగణం, పాఠశాల రికార్డులు, పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. పాఠశాల ప్రహరీ చుట్టూ ఉన్నటువంటి చెత్తాచెదారం ముళ్ళకంచెను తొలగించాలని స్కావెంజర్ స్లీపర్లకు సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంజనేయులు, రవీందర్ రెడ్డి,రాములు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.