*ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసిన పెద్దమ్మతల్లి రైతు సహకార సంఘం సభ్యులు*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల, సెప్టెంబర్ 23: (ప్రజావాణి)మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి రైతు పరస్పర సహాయక సహకార పొదుపు మరియు పరపతి సంఘం సభ్యులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరే హన్మంత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేను కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం లక్ష్యాలు, రైతులకు అందించనున్న సేవలు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో సంఘం ప్రతినిధులు చర్చించారు. రైతులకు పరస్పర సహకారం, పొదుపు, పరపతి సౌకర్యాలను అందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
అనంతరం సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి పాండరీనాథ్గౌడ్, గుడిమల్ల చంద్రయ్య ముదిరాజ్, చిందం ఐలయ్య, సంఘం అధ్యక్షుడు పిడుగు నర్సింహా ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దాసరమోని రమేష్ ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుట్టి కృష్ణ ముదిరాజ్, నూకం వెంకటేష్ ముదిరాజ్, దాసరమోని నాగేష్ ముదిరాజ్, కావలి రమేష్ ముదిరాజ్, జిలమోని శ్రీనివాస్ ముదిరాజ్, బుట్టి జంగయ్య ముదిరాజ్, తలారి కృష్ణ ముదిరాజ్, తలారి సతీష్ ముదిరాజ్, కావలి వెంకటేష్ ముదిరాజ్, బుస్సు రాజు ముదిరాజ్తో పాటు సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

