ఎల్గూర్ రంగంపేట్‌లో ఘనంగా వినాయక మండపం వద్ద మహాన్నదాన కార్యక్రమం
, సెప్టెంబర్ 22: ప్రజావాణి న్యూస్/సంగెం
సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మండపంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహాన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంగెం ఎస్‌ఐ శ్రీ వంశీ కృష్ణ గారు హాజరై ముందుగా శ్రీ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుని ఆశీర్వాదాలు తీసుకుని మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ వంశీ కృష్ణ గారు మాట్లాడుతూ, యువత భక్తితో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానం మహాదానం అని, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
యువసేన యూత్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఈ మహాన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువసేన యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
“శ్రీ గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.”
గణపతి బప్పా మోరియా! 🙏
మంగళమూర్తి మోరియా! 🐘🌺

