📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamభవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి…

రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

పనులు క్వాలిటీగా ఉంటేనే బిల్లులు మంజూరు అంటూ హెచ్చరిక


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి సుపరిపాలన అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఖమ్మం రూరల్ మండల సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఖమ్మం రూరల్ మండల సమీకృత కార్యాలయాల భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా తగ్గకుండా చేపడుతున్నదని, ఖమ్మం రూరల్ మండలంలో కార్యాలయ సముదాయ నిర్మాణ పనులను సుమారు 45 కోట్ల రూపాయలతో చేపట్టామని, పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, పనుల్లో వేగం పెంచి నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేదని, పనులు క్వాలిటీగా ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు.

ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇక్కడ భవన నిర్మాణ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.

వివిధ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయా లతో, సౌకర్యవంతంగా ఉండే విధంగా భవన సముదాయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.