*వంటమాస్టర్ కుమారుడికి అన్నప్రాసన చేసిన ఝాన్సీ రెడ్డి*
జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 22(ప్రజావాణి):
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మానవత్వానికి, ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచారు. తమ ఇంటి వద్ద వంట చేస్తున్న రాజు కుమారుడికి తమ సొంత బిడ్డలా భావించి సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్వయంగా అన్నం తినిపించి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, విద్యా బుద్ధులతో వర్ధిల్లుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా ఆకాంక్షించారు.
వంట చేసే వ్యక్తి అని చూడకుండా తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఝాన్సీ రెడ్డి చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. యజమాని ఎలా ఉండాలో ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడారు.
ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందించారు. భక్తిశ్రద్ధలతో, ఎంతో ఆప్యాయత, అనురాగాల నడుమ ఈ అన్నప్రాసన వేడుక కన్నుల పండుగగా జరిగింది.

