📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonదృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు*

దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు*

📰 Generate e-Paper Clip

*దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు*

*ప్రజావాణిలో విజ్ఞప్తి.. ఓ కుటుంబానికి కొత్త ఆశను నింపింది*

*రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి కలెక్టర్ ఉత్తర్వులు*

*ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి, వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
వర్షం పడితే ఇంట్లోకి నీరు వస్తుంది.. పాత ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం.. అయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సొంత ఇంటి కల నెరవేరని పరిస్థితి. ఇలాంటి కష్టాల్లో ఉన్న మంచుప్పుల గ్రామానికి చెందిన దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళ మేకల పద్మ తన సమస్యను ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకువచ్చారు.

*వివరాల్లోకి వెళ్తే..* జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, మంచుప్పుల గ్రామానికి చెందిన మేకల పద్మ తన తండ్రి, తమ్ముడితో కలిసి నివసిస్తున్నారు. ప్రస్తుతం వారు పాత కచ్చా ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో ఇంటి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుండటంతో, సొంత స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. విచారణలో పద్మ ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారణ కావడంతో, ఆమెకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో కొత్త ఇంటి నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో మంగళవారం, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో మేకల పద్మకు ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారురాలి ఇంటి నిర్మాణాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించాలని పాలకుర్తి ఎంపీడీఓను ఆదేశించారు. ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రభుత్వం నిర్దేశించిన దశల వారీ విధానంలో నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో మేకల పద్మ, జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజావాణిలో తన సమస్యను వినిపించిన వెంటనే స్పందించి, సొంత ఇంటి కలను నిజం చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజావాణి కేవలం ఫిర్యాదులు స్వీకరించే వేదిక మాత్రమే కాదు.. అర్హులైన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పరిష్కార వేదికగా నిలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.