*తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ..*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాలను అక్టోబర్ 2న జనగామ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నరసింగరావు తెలిపారు.
మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో, కటకం నరసింగరావు నేతృత్వంలో అక్టోబర్ 2న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం జనగామ పట్టణ కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు నల్ల నర్సింహులు తెలంగాణ రైతాంగం, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నల్ల నర్సింహులు కుమార్తె అరుణక్క, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కల్నల్ డాక్టర్ బిక్షపతి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఎలగందుల కృష్ణ, కన్న పరశురాం గౌడ్, చంద్రశేఖర్, రవి, రమేష్, బహుజన టీచర్స్ వీర నరసయ్య, పిట్టల సత్యం తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 2న నిర్వహించనున్న నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాల్లో ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన ఆలోచన సాధన సమితి పిలుపునిచ్చింది.

