📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadభారత రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు పోస్టు పెట్టిన ప్రదీప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

భారత రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు పోస్టు పెట్టిన ప్రదీప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

భారత రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు పోస్టు పెట్టిన ప్రదీప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

 

ప్రదీప్ రెడ్డి పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి

ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు పందుల విజయ్

 

భారత రాజ్యాంగ నిర్మాత జాతీయ నాయకుడు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు రాజ్యాంగ హక్కుల కోసం కృషి చేసి దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అంద చేశాడు. ఇటీవలి కాలంలో అంబేద్కర్ గారిని అవమానపరిచే వివాదాస్పదమైన కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని హై కోర్టు నిషేధించినగా. అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ఈ వివాదాస్పద పుస్తకాన్ని కలిగి ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నడనీ తొర్రూరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.ఈ పుస్తకం యొక్క మూలం, కొనుగోలు, స్వాధీనం సంబంధించిన అంశాలపై చట్ట పరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారిని అవమానపరిచే, కించపరిచే తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంద యాకమల్లు, మంగళపల్లి నాగరాజు, మంగళపల్లి శ్రీకాంత్, గణపురం హరీష్,దంతలపల్లి మండల అధ్యక్షుడు సంతోష్, సోమారపు లింగన్న, ఎదునూరి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.