గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి – జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్
— *నిఘా నీడలో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ*
*–శోభ యాత్ర సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్*
*-డి.జేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు*
*–విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు*
— *1000 మంది సిబ్బందితో శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు*
— *జిల్లా వ్యాప్తంగా 6184
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. గణేష్ విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా ఊరేగింపులు నిర్వహించబడతాయి. గణేష్ శోభాయాత్ర నిర్వహించడంతోపాటు అన్ని ప్రధాన నగరాలతో పాటు కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీటీవీ కెమెరాలను ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కమాండ్ నుంచి అధికారులు నిరంతం చేస్తున్నారు.
గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు ముందుగానే తమ విగ్రహాల ఎత్తును పరిశీలించుకుని, నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాలకు అనుగుణంగా రూట్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
*సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఉన్నందున, 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలను ఈ సంవత్సరం 14వ మైలు, హాలియా వైపు అనుమతించబడదు* .
*విగ్రహాల ఎత్తును బట్టి నిమజ్జన మార్గాలు* :
🔹 *10 అడుగుల ఎత్తు లోపు ఉన్న విగ్రహాలు* :
బతుకమ్మ కుంట / వల్లభరావు చెరువులో నిమజ్జనం చేసుకోవాలి.
🔹 *10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు:*
క్లాక్ టవర్ – రామగిరి – పానగల్ ఫ్లైఓవర్ – తిప్పర్తి – వేములపల్లి ద్వారా వేములపల్లి కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశంలో నిమజ్జనం చేసుకోవాలి..
*నిమజ్జన భద్రత కోసం 1000 మంది సిబ్బంది*
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎస్పీ పర్యవేక్షణలో ఒక ఎస్పీ, ఆడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 850 మందికి పైగా ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏ.ఆర్ సిబ్బంది మొత్తం 10 మంది విధులు నిర్వహిస్తున్నారు.
*సిసిటివి కెమెరాల పర్యవేక్షణ లో శోభ యాత్ర*
నిర్వహించిన పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన ప్రముఖుడు, నల్గొండ పట్టణంతో మిర్యాలగూడ మరియు దేవరకొండ వంటి ప్రధాన పట్టణాలలో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది.
*నిమజ్జన వస్తువుల ఏర్పాట్లు పూర్తి*
ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెర్వు, సముద్రం, 14 వ మైలు రాయి, వేములపల్లి సాగర్ కెనాల్, మిర్యాలగూడ ప్ల వాడపల్లి, నాగార్జునసాగర్, ఎడమ కాలువ కొత్త బ్రిడ్జి దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ కొండబీమనపల్లి, డిండి, పెద్ద మునిగల్ సాగర్ బ్యాక్ వాటర్ వద్ద పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. లైట్లు,క్రేన్లు, ఏర్పాటు చేశామని,నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో ఏ సమయంలో వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమయ్యేలా ఆన్లైన్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
*పట్టణ రైల్వే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్*
నిమజ్జనం రోజున జిల్లా ప్రజలకు, వాహనదారులకు శోభ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభయాత్ర నిర్వహించే మార్గం పూల్ చౌరస్తా,1 టౌన్ పోలీస్, క్లాక్ టౌన్, పుల్లా రెడ్డి సెంటర్, రామాలయం, చందమామ టవర్, పానగల్ గుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభయాత్రకు నిర్దేశించిన గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయాన్ని కలగకుండా పోలీసులు వారికి సహకరించాలి.
23వ తేదీ బుధవారం రోజున బారి వాహనాలు వెళ్లే మార్గాలు.
* హలియ – దేవరకొండ నుంచే హైదరాబాద్ కు వెళ్ళే వాహనదారులు జెఎం గౌడ్ X రోడ్డు, ఈద్గా వయ మునుగోడు బై పాస్ గిరిక బావి గూడెం, ఐటీ టవర్ మీదుగా మళ్ళించబడింది.
* మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి, నకెరేకల్, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ వైపు మళ్లింది.
* హైద్రాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి నకెరేకల్ వయ తిప్పర్తి మీదుగా మిర్యాలగూడ మళ్లించింది.
* హైదరాబాద్ నుంచి హలియా – దేవరకొండ కు వెళ్ళే వాహనదారులు ఐటీ హబ్ మునుగోడు బై పాస్,ఈద్గా వయా, జెఎం గౌడ్ X రోడ్డు మీదుగా మళ్ళించనైనది
* దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్ళే వాహనదారులు డి.ఐ.ఓ ఆఫీసు నుంచి మళ్లించడం జరిగింది.
*ప్రజలు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు*
* డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
* బాణాసంచా కాల్చరాదు.
* మద్యం సేవించి వాహనాలు నడపరాదు; ఆల్కహాల్ మీటర్ ద్వారా తనిఖీలు జరిగాయి.
* విగ్రహాలను తరలించే వాహనాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
* నిమజ్జన ప్రాంతాల చిన్నపిల్లలను అనుమతించరాదు.
* మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు; షీ టీమ్స్ నిఘా కొనసాగుతుంది.
* చిన్నపిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి.
*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు*
నిమజ్జన సమయంలో సంయమనం పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని ఎస్పీ సూచించారు. డీజేలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్, బాణాసంచా వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామని ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ జిల్లా తెలిపారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

