నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
తెలంగాణలోని ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక విజ్ఞానం కలుగుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జిల్లా స్థాయి ‘యువ టూరిజం క్లబ్’ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా పర్యాటక శాఖ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ టూరిజం సహకారంతో ‘యువ టూరిజం క్లబ్’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. వారసత్వం మరియు సమాజ ప్రోత్సాహం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. ఈ జిల్లా స్థాయి కళాశాల పోటీలలో భాగంగా షార్ట్ ఫిలిం/రీల్ పోటీలు, సోషల్ మీడియా టూరిజం క్యాంపెయిన్, టూరిజం అవేర్నెస్ స్కిల్స్, పాటలు, నృత్యం, మరియు డ్రామా వంటి వివిధ అంశాలు నిర్వహించడ్డాయి. అలాగే తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలు, మరుగన పడిన కళలు, మరియు స్థానిక భాగస్వామ్యంతో కూడిన వినూత్న ఆలోచనలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, అడిషనల్ ఎస్పీ జి రమేష్, నల్గొండ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దసరా నాయక్, జిల్లా పంచాయతి అధికారి తరుణ్ చక్రవర్తి, నల్లగొండ జిల్లా డిప్యూటీ మేయర్ అష్రాఫ్ అలీ, కార్పొరేటర్ సమద్ ఎం. డి ఇంతియాజ్ జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ న్యాయ నిర్ణేతలుగా తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్, డా. ఎం.డి హసేనా జిల్లాలోని వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
