📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonసీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై శ్రీపతిపల్లిలో భారీగా చేరికలు

సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై శ్రీపతిపల్లిలో భారీగా చేరికలు

📰 Generate e-Paper Clip

*సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై శ్రీపతిపల్లిలో భారీగా చేరికలు*

*కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాకే సాధ్యం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాకే సాధ్యమని, కష్టజీవులు అందరూ ఎర్రజెండా పట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ పిలుపునిచ్చారు.

మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై పలువురు రైతులు, యువత, కార్మికులు పెద్ద సంఖ్యలో సీపీఎంలో చేరారు.

ఈ సందర్భంగా శ్రీపతిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్ అధ్యక్షత వహించగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు హాజరై నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ దేశంలో పేదలు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్మికుల సమస్యలు, రైతులు – వ్యవసాయ కూలీల ఇబ్బందులపై సీపీఎం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.

ప్రజల హక్కుల కోసం పోరాడే ఎర్రజెండా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి యువత, కార్మికులు, రైతులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దోపిడీ, అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యమని పేర్కొన్నారు.

నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఎం విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని, భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మునిగాల రమేష్, అపారదాపు రాజు, ఆవుల ప్రభాకర్, నాగరాజు, శ్రవణ్, రాజేందర్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*పార్టీలో చేరిన వారు:* మామిడి శేఖర్, బర్మ పోశయ్య, నరాల రవీందర్, ఆసరి రాజయ్య, ముక్కెర రవి, పేల్లి కనకయ్య, మామిడి రాజు, మామిడి కుమార్, సలబాల రాజు, నక్కా సత్యనారాయణ, వెంకన్న, నక్కా రాజయ్య S/o భారతయ్య, ఇనగాల రాజు, ఇనగాల కట్టయ్య, మామిడి రవి, మామిడి అనిల్, ఇనగాల చంద్రలింగం, నరాల కనకయ్య, ముక్కెర కోమురయ్య, మామిడి భిక్షమయ్య, నరాల కుమార్, నరాల రంజిత్, ఇనుపమాల యాదగిరి, ఎల్లయ్య, నరసయ్య, మామిడి శ్రీనివాస్, నక్కా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.