*జూనియర్ కళాశాలకు స్టేజి నిర్మాణం – విరాళం*
*వేదిక నిర్మాణ దాత లయన్ ఏడ్మ సుగుణ – సంజీవరెడ్డి*
*కృతజ్ఞతలు తెలిపిన కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
జనగామ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు మూడు లక్షల వ్యయంతో నిర్మించిన ప్రేయర్ స్టేజి ఓపెనింగ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజి నిర్మాణ దాత లయన్ ఏడ్మ సుగుణ – సంజీవరెడ్డి, వారి అల్లుడు దయాకర్ రెడ్డి, కుమారుడు శ్రీనివాస్, గవర్నర్ ఎల్. నరహరి, లయన్ సుధాకర్ రెడ్డి, వాసవి క్లబ్ వైస్ గవర్నర్, డీజీఎల్ఓ లయన్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
పేద విద్యార్థులు చదువుకునే ఈ కళాశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న లయన్ క్లబ్ సభ్యులను, స్టేజి నిర్మాణ దాత ఏడ్మ సుగుణ – సంజీవరెడ్డి గార్లను కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది.
కళాశాలకు వివిధ రకాల విరాళాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కళాశాల సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమని రీజినల్ చైర్మన్ జైన రమేష్, ప్రెసిడెంట్ రావుల రవి అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ చార్టర్ మెంబర్స్ పజ్జురి గోపయ్య, పజ్జురి జయహరి, పూర్వ జిల్లా గవర్నర్లు లయన్ కన్నా పరశురాములు, డాక్టర్ లవ కుమార్ రెడ్డి, కదిరి రాజశేఖర్ రెడ్డి, కోతాటి ఉప్పలయ్య, చీరాల బాబు, తొడుపునూరి వెంకటనారాయణ, రీజియన్ చైర్మన్ డాక్టర్ మాధంశెట్టి వరూధిని, వైస్ ప్రెసిడెంట్ కాపర్తి శ్రీనివాస్, దాతలు పబ్బ చంద్రశేఖర్, బుద్ధ రమేష్, చదలవాడ రాఘవేంద్ర మరియు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
