📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్ల సర్పంచ్‌ మల్లయ్యనీ ఘన సన్మానంచిన యువకులు

గుగ్గిళ్ల సర్పంచ్‌ మల్లయ్యనీ ఘన సన్మానంచిన యువకులు

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల సర్పంచ్‌ మల్లయ్యనీ ఘన సన్మానంచిన యువకులు

బెజ్జంకి,సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను గ్రామ యువకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ సర్పంచ్ మల్లయ్య గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ,గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తీరును యువకులు అభినందించారు.
గ్రామంలోనీ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం,అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని, సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్న మల్లయ్య సేవలను గుర్తిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం యువకులు సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో యువత కూడా భాగస్వాములై సహకరిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.