📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarజమ్మికుంట మున్సిపాలిటీఅభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి

జమ్మికుంట మున్సిపాలిటీఅభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి

📰 Generate e-Paper Clip

జమ్మికుంట మున్సిపాలిటీఅభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి

* ప్రభుత్వం పట్టణ మౌలికసదుపాయాల కోసం సుమారు రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసి 15 నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది

* దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి

జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినప్పటికీ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం కారణంగా జమ్మికుంటలో అభివృద్ధి పనులుపూర్తిగాపడకేశాయిదేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనిచందంగా పట్టణ పరిస్థితి తయారైంది. ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసి 15 నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయిందిటెండర్లు పూర్తయినా ఏఈ తాత్సారంపట్టణంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఎంపికై ఎనిమిది నెలలు గడిచింది. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లతో అధికారిక ఒప్పందాలు (అగ్రిమెంట్లు) చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పై ఉంది. కానీ, సుమారు 6 నెలలుగా ఆ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేయకుండా ఏఈ తీవ్ర జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారని, దీనివల్లే పనులకు మోక్షం లభించడం లేదని పట్టణవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుకాంట్రాక్టర్ల వ్యక్తిగత సమస్యలే కారణం ఏఈ టెండర్లు పూర్తయినా ఏఈ తాత్సారంపట్టణంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఎంపికై ఎనిమిది నెలలు గడిచిందినిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లతో అధికారిక ఒప్పందాలు (అగ్రిమెంట్లు) చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పై ఉంది. కానీ సుమారు 6 నెలలుగా ఆ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేయకుండా ఏఈ తీవ్ర జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారని, దీనివల్లే పనులకు మోక్షం లభించడం లేదని పట్టణవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుకాంట్రాక్టర్ల వ్యక్తిగత సమస్యలే కారణంఏఈ వివరణఈ జాప్యంపై మున్సిపల్ ఏఈని వివరణ కోరగా రూ.15 కోట్ల నిధులకు సంబంధించి మొత్తం 24 పనులకు గాను 9 మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారని తెలిపారుఅందులో ఇప్పటికే 3 పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్టర్లు తమ వ్యక్తిగత సమస్యల కారణంగా పనులను ప్రారంభించలేదని మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసి త్వరలోనే పనులు ముందుకు సాగేలా చూస్తామని ఆయన వివరించారు. ఏది ఏమైనప్పటికీ, కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా నెలల తరబడి పనులు ముందుకు సాగకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ఆగిన అభివృద్ధి పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని జమ్మికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.