📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూకట్పల్లి జిల్లా పరిషత్త్ హై స్కూల్ వద్ద ఆక్రమణలు.. విద్యార్థులకు ఇబ్బందులు

కూకట్పల్లి జిల్లా పరిషత్త్ హై స్కూల్ వద్ద ఆక్రమణలు.. విద్యార్థులకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

కూకట్పల్లి జిల్లా పరిషత్త్ హై స్కూల్ వద్ద ఆక్రమణలు.. విద్యార్థులకు ఇబ్బందులు!

రోడ్డుపైనే చెరుకురసం బండి.. విద్యుత్ మీటర్ ఏర్పాటుపై ప్రశ్నలు

ప్రజావాణి కూకట్‌పల్లి, సెప్టెంబర్ 22: కూకట్‌పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో రోడ్డును ఆక్రమించి చెరుకురసం బండి ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బండి ఏర్పాటు చేయడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో ప్రమాదాల భయం నెలకొంటోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రోడ్డును ఆక్రమించిన ప్రాంతంలో విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయడం, విద్యుత్ కనెక్షన్ ఎలా మంజూరైందనే అంశంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సంబంధిత అనుమతులు, విద్యుత్ కనెక్షన్ మంజూరు ప్రక్రియపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.
పాఠశాల పరిసరాల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించి విద్యార్థులకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.