📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి

ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి

📰 Generate e-Paper Clip

*ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి : డీసీపీ రాజ మహేంద్ర నాయక్*

*11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ నిర్వహణ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం, ఉదయం జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద ఆయుర్వేద వెల్‌నెస్ & యోగా వాక్ ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

నెహ్రూ పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు ఆరోగ్య పరిరక్షణ, యోగా, ఆయుర్వేదం ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఆయుర్వేదం భారతీయ సనాతన వైద్య విధానమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రకృతి ఆధారిత జీవనశైలి ఎంతో కీలకమని అన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని, ఆయుర్వేదం సూచించే నివారణాత్మక ఆరోగ్య విధానాలను జీవితంలో అమలు చేయాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

అదే విధంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. యోగా, ఆయుర్వేదం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత కాలంలో జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, యోగా, ఆయుర్వేద పద్ధతులను ప్రజలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వాణిశ్రీ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ మమత, డా. సరిత, డీపీఎం కుమార్, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఆయుష్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.