📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguమానవత్వం చాటుకున్న మేడారం ఎస్ఐ కమలాకర్

మానవత్వం చాటుకున్న మేడారం ఎస్ఐ కమలాకర్

📰 Generate e-Paper Clip

 

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

గోవిందరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వరంగల్ గార్డియన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి మేడారం (నార్లాపూర్) ఎస్ఐ అచ్చ కమలాకర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేశారు.గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఈర్ల సాంబ (80) అనే వృద్ధురాలు అంగడి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమె కాలు తొంటి భాగంలో తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు, ములుగు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి వెంటనే ఆమెను గోవిందరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ గార్డియన్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎస్ఐ కమలాకర్ స్పందించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5000 ఆర్థిక సహాయాన్ని మద్దాలి నాగమణి ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు.
అలాగే వరంగల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈర్ల సాంబను పరామర్శించిన మద్దాలి నాగమణి రూ. 1000, పూజారి ప్రవళిక రూ. 500, పండ్లు అందజేసి ధైర్యం చెప్పారు.
తమ కష్టాన్ని అర్థం చేసుకుని ఆదుకున్న ఎస్ఐ కమలాకర్ కు, నాగమణి, ప్రవళిక కు బాధితురాలి కుమారుడు నాగరాజు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.