📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSiddipetపూర్తయిన ఎస్‌ఐఆర్‌ సర్వే నోటీసులపై విచారణ దర్గపల్లి గ్రామంలో వంద శాతం...

పూర్తయిన ఎస్‌ఐఆర్‌ సర్వే నోటీసులపై విచారణ దర్గపల్లి గ్రామంలో వంద శాతం పూర్తి

📰 Generate e-Paper Clip

నంగునూరు, సెప్టెంబర్ 21:ఎస్‌ఐఆర్‌ సర్వేలో భాగంగా దర్గపల్లిలో అందజేసిన నోటీసులకు సంబంధించి విచారణ, వివరాల పరిశీలన ప్రక్రియను వంద శాతం పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచి పెంబర్ల శైలజ రమేశ్ తెలిపారు. నోటీసుల్లో పేర్లు ఉన్న వ్యక్తుల వివరాలను సంబంధిత అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించిన వివరాలు, అవసరమైన ఆధారాలను పరిశీలిస్తూ నిర్ణీత విధానంలో విచారణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించినట్లు సర్పంచి వెల్లడించారు. ప్రతి వ్యక్తి వివరాలను పరిశీలించి, అవసరమైన విచారణను నిర్వహించిన అనంతరం ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి అధికారులతో కలిసి గ్రామ సర్పంచి పెంబర్ల శైలజ రమేశ్, బూత్ స్థాయి అధికారి స్వరూప, గ్రామ పంచాయతీ అధికారి రమేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది, వార్డు సభ్యులు నరసింహారెడ్డి, గొడుగు ప్రసాద్, కొల్ల నవీన్ రెడ్డి, డీలర్ ఆనంద్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ సర్వేకు సంబంధించి దర్గపల్లి గ్రామంలో నోటీసులు అందుకున్న వ్యక్తుల వివరాల పరిశీలన, విచారణ ప్రక్రియ పూర్తిగా ముగిసిందని సర్పంచ్ పెంబర్ల శైలజ రమేశ్ తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.