📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamదళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి

దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

*దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి…*

*➖చింతకాని ఎంపీడీవోకు దళిత బంధు ఐక్య కార్యాచరణ కమిటీ వినతి…*

*➖ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.. పెండింగ్ నిధులు విడుదల చేయాలి!..*

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

గత ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం పెండింగ్ నిధులను ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని దళిత బంధు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కమిటీ నాయకులు దారేల్లి రమేష్ మాట్లాడుతూ.. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాగులవంచ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో దళిత బంధుకు సంబంధించిన బాండ్లను అందజేసి, మిగతా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.అయితే, నాగులవంచ గ్రామంలోనూ, మండలంలోని ఇతర గ్రామాల్లోనూ ఇప్పటివరకు చాలామంది లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నిధులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గం అనేది ఎస్సీ రిజ్వరుడు నియోజకవర్గం కానీ ఇక్కడ ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు వచ్చే ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు,అన్నారు దళిత బంధు పథకం ద్వారా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లబ్ధి పొందని వారిని వెంటనే గుర్తించి, వారికి మిగిలిన నిధులను జమ చేయాలి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి దళిత కుటుంబానికి రూ. 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న ఇంతవరకు అమలు కాలేదు అన్నారు,ఆ హామీని వెంటనే అమలు చేయాలి. లేకుంటే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అన్నారు.
కార్యక్రమంలోబహుజన్ సమాజ్ పార్టీ మధిర నియోజకవర్గం ఇంచార్జి దారేల్లి రమేష్, స్వేరో మధుర నియోజకవర్గం ఇన్చార్జి శ్యామ్, టిఆర్ఎస్ మండల నాయకులు దర్శి బాలకృష్ణ, అంబేద్కర్ స్వచ్ఛంద కమిటీ నాయకులు చిట్టి పోగు నాగరాజు, తిరుమలాపురం సర్పంచి చాపల మడుగు వీరబాబు, టిఆర్ఎస్ మండల నాయకులు ఐతం ఆదినారాయణ, నమవరం మాజీ సర్పంచ్ తిరుపతి కొండల్ రావు, మిర్యాల శ్రీనివాసరావు, నరపోగు నాగేంద్ర బాబు చింతకాని మండల దళిత బంధు , బాధితులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.