*ఎస్టీ సబ్సిడీ బకాయిల కోసం బీజేపీ ఎస్టీ మోర్చా ఆందోళన*
*సబ్సిడీ కార్యాలయం ముట్టడి.. నాయకుల అరెస్టు*
*బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్*
మేడ్చల్,
గిరిజనులకు అందాల్సిన సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం సబ్సిడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నెనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు ఎస్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరారు.
ఆందోళన సందర్భంగా పోలీసులు పలువురు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులను అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడియా రాము నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ రవి నాయక్, మెగావత్ జీవన్ నాయక్, ప్రధాన కార్యదర్శులు వెంకట్, రమేష్, రామ్‌లాల్ నాయక్, అలియాబాద్ మున్సిపాలిటీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు భీమా నాయక్‌తో పాటు పలువురు ఎస్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

