📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ*

*శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ*

📰 Generate e-Paper Clip

*శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ*

మేడ్చల్, నేటి ప్రస్థానం: మేడ్చల్ పరిధిలోని శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం యువజన సంఘం కమిటీ సభ్యులు ఎర్ర విజయరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ తనను కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీ సరస్వతి యువజన సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఓం రాజ్, డబ్బు శంకర్, దండు శ్రీకాంత్, లారా, గిరి, రాజేష్, దేశమంతరావు, మహేష్, జీవన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.