📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonకొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి - తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి – తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు

📰 Generate e-Paper Clip

*కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి – తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు*
*14వ వర్ధంతి సందర్భంగా బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం నాయకులు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి):
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం నాయకులు అన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థలం వద్ద పట్టణ పద్మశాలి సంఘం నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెనుగొండ రమేష్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్, పోపా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు ఎనలేని సేవలను అందించారని, తొలి దశ, మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని లెక్కచేయకుండా తృణప్రాయంగా వదిలేసిన గొప్ప మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తన ఊపిరిగా జీవించి చైతన్యాన్ని కలిగించారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

బాపూజీ ఆశయాలు, సామాజిక సేవా స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వర్లు, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిదురాల మార్కండేయ, విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి సోమేశ్వర్, ఉపాధ్యక్షులు ఈగ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు చిలుకమారి శ్రీధర్, ఎనగందుల శ్రీనివాస్, చిదురాల దేవేందర్, చిలుకమారి వరప్రసాద్, మార్గం సతీష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.