📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetనిమజ్జనాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి

నిమజ్జనాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

నిమజ్జనాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి

హిందువుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి

బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక నిమజ్జనాలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ బ్రిడ్జి వద్ద నీటి విడుదల కోరుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం హిందూ సమాజానికి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన నీటిని ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల విశ్వాసాలను గౌరవించి ఎస్ఆర్ఎస్ పీ నీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శులు బీరం చంద్రారెడ్డి, జల్ల అనిల్ యాదవ్, మండల దళిత మోర్చా అధ్యక్షుడు రాజమల్లు బెజ్జంకి, బీజేపీ నాయకుడు రావుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.