📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిఐఎస్ఎఫ్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజలు

సిఐఎస్ఎఫ్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజలు

📰 Generate e-Paper Clip

*సిఐఎస్ఎఫ్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజలు*

*తులసీ శ్రీనివాస్ – లక్ష్మీ దంపతులకు వేలంలో లడ్డు సొంతం*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

పట్టణంలోని సింగరేణి సిఐఎస్ఎఫ్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి లడ్డు వేలం పాట నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలం పాటలో కాలనీవాసుడు, పట్టణ సీనియర్ జర్నలిస్ట్ తులసీ శ్రీనివాస్–లక్ష్మీ దంపతులు 11,116 రూపాయలు అధికంగా వేలం పాట పాడి, గణనాథుని లడ్డును సొంతం చేసుకున్నారు. కాలనీలో తొలిసారిగా లడ్డూ వేలం పాట చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా తులసీ శ్రీనివాస్ – లక్ష్మీ దంపతులు, అతని తల్లి భాగ్యలక్ష్మీ, కుమార్తె హీరేన్ శ్రీ, కుమారుడు నిత్విన్ లు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, మండలి నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తులసీ శ్రీనివాస్ – లక్ష్మీ దంపతులు మాట్లాడుతూ, వినాయకుడి అనుగ్రహంతో స్వామివారి ప్రసాదం తమకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.