📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguవ్యవసాయ క్షేత్రాల్లో చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

వ్యవసాయ క్షేత్రాల్లో చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

📰 Generate e-Paper Clip

 

చిన్నారుల భద్రత తల్లిదండ్రుల బాధ్యత

ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లాలో ఇటీవల రాఖి కోసం వచ్చి ములుగు లో గల జీవంతరావుపల్లి కీ సమీపంలో గల గణేష్ రావు కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు మరణించగా
ఈ రోజు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిందేవిపేట గ్రామంలో ఇద్దరు బాలికలు 18 మరియు 10 సంవత్సరాల వారు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు ములుగు జిల్లా ఎస్పీ కె. సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ కీలక సూచనలు చేశారు.
వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో చిన్నారులను వ్యవసాయ క్షేత్రాలకు వెంట తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
అనివార్య పరిస్థితుల్లో చిన్నారులను వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లాల్సి వస్తే, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టకుండా తల్లిదండ్రులు లేదా పెద్దలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న బావులు, నీటి గుంతలు, చెరువులు, కాలువలు, విద్యుత్‌ స్తంభాలు, హైటెన్షన్ విద్యుత్‌ తీగలు వంటి ప్రమాదకర ప్రాంతాల వద్ద చిన్నారులు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
చిన్నారుల భద్రత తల్లిదండ్రుల బాధ్యత. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రమాదాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చు.” అని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.