పెద్ద పోచారంలో ఘనంగా మహా అన్నదానం
ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 20
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాలే ఉపేందర్ రెడ్డి– రమాదేవి దంపతులు భక్తిశ్రద్ధలతో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, గ్రామస్థులకు దంపతులు స్వయంగా అన్నం, వంటకాలను వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేపట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మాలే ఉపేందర్ రెడ్డి– రమాదేవి దంపతుల సేవాభావాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. విఘ్నేశ్వరుని కృపతో దంపతుల కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. గ్రామస్థులు, భక్తులు అన్నదానంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
పెద్ద పోచారంలో ఘనంగా మహా అన్నదానం
RELATED ARTICLES

