పెద్ద పోచారంలో ఘనంగా మహా అన్నదానం
పెద్ద పోచారంలో ఘనంగా మహా అన్నదానం ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 20 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాలే ఉపేందర్ రెడ్డి– రమాదేవి దంపతులు భక్తిశ్రద్ధలతో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, గ్రామస్థులకు దంపతులు స్వయంగా అన్నం, వంటకాలను వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక...