📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్త

విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్త

📰 Generate e-Paper Clip

*విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్త*:

– *జనగామ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలో నైనా ఉండవచ్చునని జాగ్రత్తగా ఉండాలని జనగామ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి సూచించారు. శనివారం జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జడ్పీ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల పై పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు ఉదాహరణకు చాక్లెట్స్, ఈ చాక్లెట్స్ రూపంలో ఉండవచ్చని, వాటిని అపరిచితుల దగ్గర నుంచి తీసుకో రాదని విద్యార్థులకు సూచించారు. అలాంటి డ్రగ్ చాక్లెట్లను అది మనం వేరే వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నా, మన దగ్గర ఉంచుకున్నా, వేరే వాళ్ళకి ఇచ్చిన నేరమే అని తెలిపారు. అలాంటివి ఎవరి దగ్గరైనా ఉన్నవి అని తెలిసిన యెడల దగ్గరలోని ఉపాధ్యాయులకు చెప్పండని అన్నారు. అలాగే బాల్య వివాహాల గురించి మాట్లాడుతూ బాలికలు ముఖ్యంగా మొబైల్ కి దూరంగా ఉండాలని జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి, పిఎల్వి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.