📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపెద్దపహాడ్ యాదవుల 4.04 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పైన విచారణ జరుపాలి

పెద్దపహాడ్ యాదవుల 4.04 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పైన విచారణ జరుపాలి

📰 Generate e-Paper Clip

*పెద్దపహాడ్ యాదవుల 4.04 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పైన విచారణ జరుపాలి!*

*అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19 (ప్రజావాణి):
జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకందారుల సంఘానికి చెందిన 4.04 ఎకరాల భూమి (స.నెం. 582/F, 583/G/5) ను ఉస్మానియా ఆగ్రో ఇండస్ట్రీస్ నకిలీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ (డాక్యు. నెం. 11/2007) చేసుకుందని 130 మంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

2005లో తమ సంఘం పేరున ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని, కలెక్టర్, ఎంఆర్ఓ లకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.

విషయం తెలుసుకున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో భూమిని సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి భూమిని తిరిగి ఇప్పించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బనుక సిద్దిరాజ్ యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు పురమాణి రజాక్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తొట్టె నరేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బొంగు ఐలయ్య యాదవ్, నాయకులు గాజుల సిద్దిలింగం యాదవ్, మేకల మహానందు యాదవ్, సాదం మధుసూదన్ యాదవ్, బూస రమేష్ యాదవ్, దడిగే రవికుమార్ యాదవ్, మారబోయిన ప్రకాష్ యాదవ్, గంగుల మధు, కారే రమేష్, కారే కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.