జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శుక్రవారం “మానవాడ ఫ్యామిలీ గణపతి” సన్నిధిలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలో సుమారు 30 మంది ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేద పండితులు రంగాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. మంత్రోచ్ఛారణల నడుమ సాగిన ఈ పూజలో కుటుంబ సభ్యులు, మహిళలు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
గుల్లకోటలో ఘనంగా మానవాడ ఫ్యామిలీ గణపతి కుంకుమ పూజ
RELATED ARTICLES

