📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి ఆస్తుల లెక్కలు తేల్చాలి!

పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి ఆస్తుల లెక్కలు తేల్చాలి!

📰 Generate e-Paper Clip

పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి ఆస్తుల లెక్కలు తేల్చాలి!

– వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి):
ప్రజాప్రతినిధులు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు, అనంతరం ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను పోల్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ శుక్రవారం
డిమాండ్ చేశారు.
ఎన్నికల అఫిడవిట్ ఆధారిత సమాచారం ప్రకారం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2014లో సుమారు రూ.42.38 కోట్ల ఆస్తులు, 2018లో సుమారు రూ.41.83 కోట్ల ఆస్తులు ప్రకటించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు 2014 ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.2.47 కోట్ల ఆస్తులు, 2018లో సుమారు రూ.8.12 కోట్లు, 2023లో సుమారు రూ.12.63 కోట్ల ఆస్తులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితర ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను కూడా అధికారిక రికార్డుల ఆధారంగా పరిశీలించి, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఆస్తుల పెరుగుదలకు సంబంధించిన ఆదాయ వనరులు, భూముల కొనుగోళ్లు, యాజమాన్య బదలాయింపులు తదితర అంశాలపై అధికారికంగా పరిశీలన జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.