పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి ఆస్తుల లెక్కలు తేల్చాలి!
పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి ఆస్తుల లెక్కలు తేల్చాలి! – వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి): ప్రజాప్రతినిధులు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు, అనంతరం ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను పోల్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్ ఆధారిత సమాచారం ప్రకారం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2014లో సుమారు రూ.42.38 కోట్ల ఆస్తులు, 2018లో సుమారు రూ.41.83 కోట్ల ఆస్తులు ప్రకటించినట్లు తెలిపారు....