📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఆరుట్లలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

ఆరుట్లలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

**ఆరుట్లలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు*

*విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమం*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):
మంచాల మండలం, సెప్టెంబర్ 18: ఆరుట్ల గ్రామంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఇంద్రోజ్ నరేష్ చారి, ఉపాధ్యక్షుడు ఇంద్రోజ్ పురుషోత్తం చారి, కార్యదర్శి కొల్లోజ్ శంకరచారి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం యజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్వకర్మ సంఘానికి చెందిన పలువురు సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని విరాట్ విశ్వకర్మను ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘానికి చెందిన కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, కుల పెద్దలు, మహిళలు, యువత తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.