📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబడా గణేశ్‌ సన్నిధిలో నీలం మధు ముదిరాజ్‌.. ప్రజా క్షేమం కోసం ప్రార్థన

బడా గణేశ్‌ సన్నిధిలో నీలం మధు ముదిరాజ్‌.. ప్రజా క్షేమం కోసం ప్రార్థన

📰 Generate e-Paper Clip

*బడా గణేశ్‌ సన్నిధిలో నీలం మధు ముదిరాజ్‌.. ప్రజా క్షేమం కోసం ప్రార్థన

*రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు

పటాన్చెరు, సెప్టెంబర్‌ 18 (ప్రజావాణి):ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్‌ను మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.
బడా గణేశ్‌ దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు నీలం మధుకు తీర్థప్రసాదాలు అందించి, వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నీలం మధుకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహాగణపతి అని అన్నారు. బడా గణేశ్‌ను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఐక్యత, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం నెలకొనాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ రాజ్‌కుమార్‌, ఫౌండర్‌ వీణ మాధురి, రాజశేఖర్‌, మొగోల్‌, రాజు, బాబుల్‌, సందీప్‌, రాకేష్‌, అభిషేక్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, ఎన్‌ఎం‌ఆర్‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.