📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపారిశుధ్యమే ప్రాణం.. కార్మికులే మన ప్రాణదాతలు

పారిశుధ్యమే ప్రాణం.. కార్మికులే మన ప్రాణదాతలు

📰 Generate e-Paper Clip

*పారిశుధ్యమే ప్రాణం.. కార్మికులే మన ప్రాణదాతలు!*

— మానవత్వం చాటిన దాత గంగుల శ్రీనివాస్

*రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):*

గ్రామ పారిశుధ్యమే ప్రజల ఆరోగ్యానికి పునాది అని, ఆ పునాదిని కాపాడే పారిశుధ్య కార్మికులే నిజమైన ప్రాణదాతలని సామాజిక సేవకులు గంగుల శ్రీనివాస్ అన్నారు.రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రతి నెలా చేపడుతున్న వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మికులకు అవసరమైన సబ్బులు, సర్ఫ్, కొబ్బరి నూనె వంటి నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేశారు.దాత గంగుల శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులను మండల వైద్యాధికారి డాక్టర్ కస్తూరి సతీష్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు లేనిదే గ్రామాభివృద్ధి, ప్రజారోగ్యం సాధ్యం కాదని, వారి కృషిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతృత్వంతో ముందుకు వచ్చిన గంగుల శ్రీనివాస్ ను గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలారి నాగమణి రాజేష్, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.