📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliలైన్ లారీ యజమానుల సంక్షేమానికి రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అండదండలు

లైన్ లారీ యజమానుల సంక్షేమానికి రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అండదండలు

📰 Generate e-Paper Clip

 

 

40 ఏళ్ల సంఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి

 

సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి

 

రామగుండం సెప్టెంబర్ 18 ప్రజావాణి :

 

లైన్ లారీ యజమానుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం గౌరవ అధ్యక్షుడు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ విశేషంగా కృషి చేస్తున్నారని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంఘానికి గౌరవ అధ్యక్షుడి గా రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లారీలకు సరైన లోడింగ్ లేకపోవడంతో పలువురు యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు లారీలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ పరిస్థితుల్లో లారీ యజమానులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, హోటల్ నిర్వాహకులు తదితర లారీ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. వడ్ల టెండర్‌తో పాటు ఎన్టీపీసీ నుంచి లోడింగ్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని, బొగ్గు లోడింగ్ తగ్గిపోయిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన సంబంధిత వ్యక్తులు, సిమెంట్ కంపెనీలు, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలతో చర్చించి లారీ యజమానులకు ప్రతిరోజూ సుమారు 100 లారీలకు బొగ్గు లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే సంఘం పార్కింగ్ యార్డులో సుమారు రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. యూరియా లోడింగ్‌కు సంబంధించి కూడా కంపెనీ సీఈఓతో చర్చలు జరుపుతూ లారీ యజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు.

సంఘం 40 ఏళ్ల చరిత్రలో లారీ యజమానుల సంక్షేమం కోసం ఇంతగా సేవలందించిన నాయకుడు మరొకరు లేరని కుందూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లారీ యజమానుల కుటుంబాల సంక్షేమం కోసం రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ చేస్తున్న కృషికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యం.డి. ఖాజా మొహినొద్దీన్ (అమ్ము భాయ్), తంగెళ్ల పాండురంగారావు, గండ్ర రఘుపతిరావు, కర్రి తరుణ్ కుమార్, వైద్య శ్రీనివాస్, యం.డి. సలీం పాషా, యన్న రాంరెడ్డి, గుడికందుల లచ్చయ్య, యం.డి. రాజ్ మహ్మద్, సయ్యద్ కరీం, గండ్ర ఆనందరావు, మాదారపు హరీష్ రావు, పొన్నం శ్యామ్ సుందర్ గౌడ్, చల్లా రాజిరెడ్డి, యం.డి. మోహిత్ ఖాన్, వాజిద్, శ్రీనివాస్, మంతరెడ్డి, చెల్పూరి సతీష్, మేకల రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.