📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*రోడ్డు కష్టాలకు చెక్‌.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం! *ప్రజల సమస్య విన్న శశిధర్‌రెడ్డి.....

*రోడ్డు కష్టాలకు చెక్‌.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం! *ప్రజల సమస్య విన్న శశిధర్‌రెడ్డి.. అధికారులతో సమన్వయం చేసి సమస్యకు పరిష్కారం అమీన్‌పూర్, సెప్టెంబర్‌ 17 (ప్రజావాణి):అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్‌రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సీఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్‌ సృజన లక్ష్మీనగర్‌ కాలనీలో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపుతూ సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. పనుల పురోగతిని శశిధర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. కొంతకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఆయన.. సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజల అవసరాన్ని గుర్తించి అధికారులతో సమన్వయం చేస్తూ సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం.. అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.. పరిష్కారం సాధించే వరకు అనుసరించడం తన విధానమని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో సృజన లక్ష్మీనగర్‌ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకుని పరిష్కారానికి చొరవ చూపిన శశిధర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.