పేదరికాన్ని జయించి MBBS సీటు సాధించిన ప్రకాష్ నగర్ చదువుల తల్లి లక్ష్మీ కళ్యాణి.
అభినందనలు తెలియజేసిన స్థానిక కౌన్సిలర్ చక్రీ నాయక్.
ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. ప్రతిభ ఎవరి సొత్తూ కాదు, పట్టుదల ఉంటే పేదరికాన్ని జయించి ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రకాష్ నగర్ కు చెందిన జనగార్ల రాము మరియు నాగ మల్లేశ్వరి పుత్రిక అయిన జనగార్ల లక్ష్మీ కళ్యాణి. సామాన్య పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని, తాజాగా వెలువడిన జాతీయ స్థాయి నీట్ (NEET) ఫలితాలలో 431 ర్యాంక్ తో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన MBBS సీటు సాధించింది. ఈ ఘన విజయం అటు తల్లిదండ్రులకు మరియు కాలనీ వాసులకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.
లక్ష్మీ కళ్యాణి సాధించిన విజయానికి స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ ఆంగోతు చక్రీ నాయక్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. బీద-గొప్ప అనే తేడా లేకుండా టాలెంట్‌తో ఉన్నత శిఖరాలను చేరవచ్చని ఈ చదువుల తల్లి నిరూపించిందని కొనియాడారు. ఇదే తపనతో భవిష్యత్తులో ఆమె గొప్ప డాక్టర్‌గా ఎదిగి, తల్లిదండ్రులకు మరియు కాలనీకి మరింత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేశారు.

