📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

📰 Generate e-Paper Clip

*టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి*

*అక్రమంగా తరలిస్తున్న 12 పశువులు, వాహనం స్వాధీనం*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

పట్టణంలో బుధవారం అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి బి శ్రీనివాస్ రావు నేతృత్వంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలోని రాజారాంపల్లె మార్కెట్ కు పశువులను అక్రమంగా తరలిస్తున్న మహీంద్రా క్యాంపర్(టిఎస్ 20 టి 6061) వాహనాన్ని పోలీసులు ఆపి, తనిఖీ చేయగా, వాహనంలో 8 ఆవులు, 4 దూడలు మొత్తం 12 పశువులు ఉన్నట్లు గుర్తించి, పశువులతో పాటు మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాన్ని ఆపిన సమయంలో డ్రైవర్ వారిని గమనించి, వాహనం నుంచి దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న డ్రైవర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న 12 పశువులు, మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.