📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaతెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం : చండూరు మున్సిపాలిటీలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షలు ప్రజా భాగస్వామ్యంతో కూడిన పాలనకు ఈ రోజు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారిచంద్రశేఖర్, సామ సుజాతయాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్ , కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ సలీమా షరీఫ్ , మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, ఎ. జగన్, బి. సాయిరాం, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.