పోత్కపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి మిఠాయిల పంపిణీ
ఓదెల, సెప్టెంబర్ 17: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా యువమోర్చా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించడం పట్ల నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిరిసేటి విరస్వామి, పులి కొమరయ్య, మహేందర్ రెడ్డి, టోట్ల సతీష్ యాదవ్, గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు అగ్గి శ్రీనివాస్, చెర్లపెల్లి రాజు, బిక్షపతి, రాపర్తి స్వామి, నిర్ల సంతోష్, అజయ్, అభిలాష్, నల్లగొని శ్రీనివాస్, రాజకుమార్, రామస్వామి, మొగిలయ్య తదితర బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

