హనుమ తండా అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం
మద్దూరు సెప్టెంబర్ 17,ప్రజా వాణి,
మండలంలోని హనుమతండ అంగన్వాడి కేంద్రంలో టీచర్ శారద ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ బదావత్ లలిత శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భిణీలు ఆకు కూరలు, పాలు గుడ్లు తీసుకోవడంతో పుట్టే బిడ్డ బలంగా ఉంటుందని అన్నారు. అదే విధంగా పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్.గౌతమి, ఏ ఎన్ ఏం జ్యోతిరాణి, ఆశా కార్యకర్తలు,పిల్లలు, పాల్గొన్నారు.

