📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదం

ఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదం

రూ.4.40 లక్షల విలువైన సామగ్రి దగ్ధం

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల సమాఖ్య భవనంలోని స్టోర్ రూమ్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన పలు రకాల సామగ్రి పూర్తిగా కాలిపోయింది.
ఎల్కతుర్తి మైలా సమాఖ్య అధ్యక్షురాలు రొడ్డుబోయిన స్వర్ణలత తెలిపిన వివరాల ప్రకారం..మండల సమాఖ్య భవనంలోని స్టోర్ రూమ్‌లో 829 ఇందిరమ్మ  చీరెలు  ష్టీల్ ప్లేట్లు, గ్లాసులు, 25 టార్పాలిన్ పట్టాలు తదితర సామగ్రిని నిల్వ ఉంచారు. బుధవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సామగ్రి మొత్తం దగ్ధమైంది.
అగ్నిప్రమాదంలో కాలిపోయిన సామగ్రి విలువ సుమారు రూ.4.40 లక్షలు ఉంటుందని స్వర్ణలత తెలిపారు. ఘటనపై ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్,ఎస్ఐ నరసింహారావు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలను గుర్తించడంతో పాటు నష్టంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.